News July 25, 2024
నేటి ముఖ్యాంశాలు

* TG: హామీలు నెరవేర్చనందుకు సీఎం రేవంత్ రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి
* కేంద్రం రీబడ్జెట్ ప్రవేశపెట్టాలని TG అసెంబ్లీ తీర్మానం
* కేసీఆర్‌తో కలిసి జంతర్ మంతర్‌లో దీక్ష చేస్తా: రేవంత్
* రేవంత్‌లా చీకటి ఒప్పందాలు మాకు చేతకాదు: KTR
* AP: ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేస్తాం: CBN
* రాష్ట్రంలో మద్యపాన నిషేధం అసాధ్యం: పవన్
* ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులు నిరసిస్తూ ఢిల్లీలో జగన్ ఒక్కరోజు దీక్ష
Similar News
News December 7, 2025
764 ఉద్యోగాలకు నోటిఫికేషన్

DRDOకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్లో 764 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B 561, టెక్నీషియన్-A 203 పోస్టులున్నాయి. వయసు 18-28 ఏళ్లు ఉండాలి. ఒకట్రెండు రోజుల్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్ https://www.drdo.gov.in/లో అందుబాటులో ఉంటుంది.
News December 7, 2025
‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్‌పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్‌గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.
News December 7, 2025
వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.


