News September 3, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: ఖమ్మంలో పర్యటించిన సీఎం రేవంత్.. బాధితులకు పరిహారం పెంపు
* ఖమ్మం ప్రజలంతా ధైర్యంగా ఉండండి: టీజీ మంత్రులు
* BRS విజన్‌తోనే మరింత మెరుగ్గా హైదరాబాద్: KTR
* AP: సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే సహించం: CBN
* ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయిలో 11.41 లక్షల క్యూసెక్కుల వరద
* బ్యారేజికి ఎలాంటి ముప్పు లేదు: మంత్రి నిమ్మల
* విజయవాడలో వరద బాధితులను పరామర్శించిన జగన్

Similar News

News November 23, 2025

హనుమకొండ: 25-29 వరకు ఇన్‌‌స్ట్రక్టర్లకు శిక్షణ

image

జిల్లాలో ప్రీప్రైమరీ విద్యా బోధన నాణ్యతను మెరుగుపర్చేందుకు 45 పాఠశాలల నుంచి ఎంపికైన 45 ఇన్‌‌స్ట్రక్టర్లకు ఈ నెల 25-29 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరిగే ఈ శిక్షణలో బోధనా నైపుణ్యాలు, తరగతి నిర్వహణ, పర్యవేక్షణ అంశాలపై డీఆర్పీలు మార్గదర్శనం చేయనున్నారు. డిసెంబర్ 1న హెచ్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్సు డైరెక్టర్ డా.బండారు మన్మోహన్ తెలిపారు.

News November 23, 2025

సామ్ కరన్ ఎంగేజ్‌మెంట్

image

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్‌ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్‌లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.

News November 23, 2025

పిల్లలు బరువు తగ్గుతున్నారా?

image

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.