News May 26, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* ముగిసిన 6వ దశ పోలింగ్.. 60.38% ఓటింగ్ నమోదు
* బలమైన ప్రతిపక్షం లేకపోవడం బాధాకరం: మోదీ
* TG: కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
* ఉద్యోగాలు, అభివృద్ధిపై చర్చకు సిద్ధం: కేటీఆర్
* గుజరాత్‌లో ఘోర ప్రమాదం.. 24 మంది మృతి
* IPL: రేపు SRH, కేకేఆర్ మధ్య ఫైనల్ మ్యాచ్
* అమెరికాకు బయల్దేరిన భారత జట్టు

Similar News

News October 14, 2025

తాజా రౌండప్

image

* తప్పిపోయిన పిల్లల కేసుల పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రంలో నోడల్ అధికారులను నియమించాలని SC ఆదేశాలు
* ఈ నెల 18న BC సంఘాలు నిర్వహించే బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన TG జనసమితి చీఫ్ కోదండరాం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు రెండో రోజు 10 మంది నామినేషన్లు దాఖలు
* TG ఇరిగేషన్ శాఖలో 106 మంది అధికారులు క్షేత్రస్థాయిలో బదిలీ
* నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ 81, సెన్సెక్స్ 297 పాయింట్లు పతనం

News October 14, 2025

విజయనగరం జిల్లాలో మెగా జాబ్ మేళా

image

విజయనగరం జిల్లాలోని గరివిడి SDS డిగ్రీ కాలేజీలో రేపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో వివిధ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ చేసుకోనున్నాయి. 10 MNC కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి.

News October 14, 2025

మీ స్కిన్‌టైప్ ఇలా తెలుసుకోండి

image

మన చర్మతత్వాన్ని బట్టి ఉత్పత్తులు ఎంచుకోవాలి. లేదంటే ఎన్ని కాస్మెటిక్స్ వాడినా ఉపయోగం ఉండదు. మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలంటే చర్మంపై వివిధ ప్రాంతాల్లో బ్లాటింగ్ పేపర్‌ను పెట్టాలి. తర్వాత ఆ షీట్‌ను వెలుతురులో చెక్ చేయాలి. ఆయిల్ కనిపించకపోతే మీది పొడి చర్మం, నుదురు, ముక్కు దగ్గర ఆయిల్ ఉంటే మీ చర్మం డ్రై, ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అని, పేపర్ పూర్తి ఆయిల్‌గా కనిపిస్తుంటే ఆయిలీ స్కిన్ అని అర్థం.