News September 22, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* AP: ఈ నెల 25న వరద బాధితులకు సాయం: CBN
* రేపటి నుంచి DY.CM పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్ష
* జగన్.. దమ్ముంటే బహిరంగ చర్చకు రా?: హోం మంత్రి అనిత
* బాబు, లోకేశ్ ప్రమాణానికి సిద్ధమా?: అంబటి రాంబాబు
* TG: ITIల సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలి: CM రేవంత్
* గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ: మంత్రి పొంగులేటి
* అమృత్ పథకంలో రేవంత్ ఫ్యామిలీ అవినీతి: కేటీఆర్
* ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణ స్వీకారం

Similar News

News September 22, 2024

సింహాచలం అప్పన్న ఆలయంలో నెయ్యి సీజ్

image

AP: విశాఖ జిల్లాలోని ప్రముఖ సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించి 945 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. ఏలూరు జిల్లా రైతు డెయిరీ నుంచి నెయ్యి సరఫరా అయినట్లు అధికారులు తెలిపారు. నెయ్యి, లడ్డూలో వాడే ఇతర పదార్థాల శాంపిల్స్‌ని సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు.

News September 22, 2024

కోహ్లీ రికార్డును సమం చేసిన అఫ్గాన్ బ్యాటర్!

image

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ తాజాగా సమం చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అఫ్గాన్ రెండో వన్డే కూడా తాజాగా గెలిచింది. సెంచరీతో ఆ గెలుపులో గుర్బాజ్ కీలక పాత్ర పోషించారు. ఇది అతడికి ఏడో వన్డే సెంచరీ. 23 ఏళ్లలోపే ODIల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా విరాట్‌ రికార్డును సమం చేశారు. 8 సెంచరీలతో సఫారీ బ్యాటరీ డికాక్ అగ్రస్థానంలో ఉన్నారు.

News September 22, 2024

సెప్టెంబర్ 22: చరిత్రలో ఈరోజు

image

1936: దర్శకుడు విజయ బాపినీడు జననం
1948: రంగస్థల నటుడు, దర్శకుడు మల్లాది గోపాలకృష్ణ జననం
1952: రచయిత, కళాకారుడు అడివి బాపిరాజు మరణం
2004: సంగీత దర్శకుడు బి.గోపాలం మరణం
2009: నటి, గాయని ఎస్.వరలక్ష్మి మరణం
➤క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం