News September 23, 2024
నేటి ముఖ్యాంశాలు

* మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం
* AP: రేపు తిరుమలలో శాంతియాగం: చంద్రబాబు
* 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్
* చంద్రబాబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* నెయ్యిలో కల్తీ జరిగితే చంద్రబాబుదే బాధ్యత: అంబటి
* TG: స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సీఎల్పీ సమావేశం
* అమృత్ టెండర్లు.. మంత్రి పొంగులేటికి KTR సవాల్
* బంగ్లాపై తొలి టెస్టులో భారత్ విజయం
Similar News
News December 8, 2025
కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.. అల్లూరిలో 5.3 డిగ్రీలు నమోదు

ఏపీలో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అల్లూరి జిల్లాలోని జి.మాడుగుల మండలంలో 5.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంచంగిపట్టులో 7.7, డుంబ్రిగూడలో 8.2, అరకులో 8.9, చింతపల్లి 9.5, హుకుంపేటలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అటు తెలంగాణ HYDలోని HCUలో 9 డిగ్రీలు, BHELలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు పేర్కొన్నారు.
News December 8, 2025
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<
News December 8, 2025
‘హమాస్’పై ఇండియాకు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి

‘హమాస్’ను ఉగ్ర సంస్థగా ప్రకటించాలని భారత్‌ను ఇజ్రాయెల్ కోరింది. పాక్‌కు చెందిన లష్కరే తోయిబా, ఇరాన్ సంస్థలతో దీనికి సంబంధాలున్నాయని చెప్పింది. గాజాలో కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా దాడులకు అంతర్జాతీయ సంస్థలను వాడుకుంటోందని తెలిపింది. హమాస్ వల్ల ఇండియా, ఇజ్రాయెల్‌కు ముప్పు అని పేర్కొంది. ఇప్పటికే US, బ్రిటన్, కెనడా తదితర దేశాలు హమాస్‌ను టెర్రర్ సంస్థగా ప్రకటించాయి.


