News October 16, 2024
నేటి ముఖ్యాంశాలు

* TG: దామగుండంలో రాడార్ స్టేషన్కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం రేవంత్
* గురుకులాలను వెంటనే తెరవకపోతే చట్టపరమైన చర్యలు: మంత్రి పొన్నం
* గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు
* ఏపీ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల ప్రకటన
* కూటమి ప్రభుత్వం మూడేళ్లే ఉంటుంది: కాకాణి
* వయనాడ్ ఉపఎన్నిక బరిలో ప్రియాంక: AICC
* మహారాష్ట్రలో నవంబర్ 20న, ఝార్ఖండ్లో NOV 13, 20వ తేదీల్లో పోలింగ్
Similar News
News December 4, 2025
అఖండ-2 ప్రీమియర్స్ రద్దు.. కారణమిదేనా?

వివాదాల కారణంగానే ‘అఖండ-2’ ప్రీమియర్లు <<18466572>>రద్దైనట్లు<<>> తెలుస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్కు 14 రీల్స్ సంస్థ రూ.28Cr చెల్లించాల్సిన వివాదం నేపథ్యంలో సినిమాను <<18465729>>ఆపాలని<<>> మద్రాసు HC ఆదేశించింది. అటు మూవీకి పనిచేసిన కొందరు టెక్నీషియన్లు కూడా తమకు వేతనాలు ఇవ్వలేదంటూ ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ కారణాలతోనే ప్రీమియర్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కానీ టెక్నికల్ గ్లిచ్ వల్లే ఆగిపోయినట్లు 14 రీల్స్ చెబుతోంది.
News December 4, 2025
మార్స్పై టైమ్ 477 మైక్రోసెకండ్ల ఫాస్ట్.. ఎందుకంటే?

మైక్రోసెకండ్ అంటే సెకనులో మిలియన్ వంతు. మనకు ఇది లెక్కలోకి రాని వ్యవధి. కానీ సోలార్ సిస్టమ్లో కచ్చితమైన నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్లాన్ చేస్తున్న స్పేస్ ఏజెన్సీలకు ఇది చాలా ముఖ్యం. భూమితో పోల్చితే అంగారకుడిపై గడియారం 477 మైక్రోసెకండ్లు వేగంగా వెళ్తుందని సైంటిస్టులు గుర్తించారు. ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీ ప్రకారం బలహీనమైన గురుత్వాకర్షణ, ఆర్బిటల్ ఫ్యాక్టర్స్ దీనికి కారణమన్నారు.
News December 4, 2025
వాస్తును నమ్మవచ్చా?

వాస్తుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని నిజమని నమ్ముతారు. మరికొందరు మూఢనమ్మకమని అభిప్రాయపడతారు. అయితే వాస్తు అనేది ఓ శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇది కేవలం ఓ నమ్మకం కాదు. జీవన మనుగడకు అవసరమైన పంచభూతాలను ఈ శాస్త్రం సమన్వయం చేస్తుంది. నివాసయోగ్యత కోసం మనం నివసించే ప్రదేశాలలో ఈ పంచభూతాల సమతుల్యత కోసం వాస్తును పాటించాలి’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


