News May 27, 2024
నేటి ముఖ్యాంశాలు

* ఐపీఎల్-2024 విజేత KKR
* ఏపీలో కూటమిదే అధికారం: అమిత్ షా
* AP: పిన్నెల్లి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని
* TG: రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందనడం హాస్యాస్పదం: ఉత్తమ్
* TG: సన్నబియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కామ్: KTR
* TG: జులైలో రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల
* TG: రేపు ఎమ్మెల్సీ ఉపఎన్నిక
Similar News
News January 12, 2026
నేడే PSLV-C62 ప్రయోగం

AP: ఈ ఏడాదిలో తొలి ప్రయోగానికి ISRO సిద్ధమైంది. తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C62 రాకెట్ ఈ రోజు ఉదయం 10.18 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంలో ప్రధానంగా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1ను రోదసిలోకి పంపనున్నారు. దీనికి తోడుగా 8 దేశాలకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేయనున్నాయి.
News January 12, 2026
బెర్క్షైర్ హాత్వే కొత్త CEOకి భారీ వేతనం

వారెన్ బఫెట్ <<18720997>>పదవీ విరమణ<<>> అనంతరం బెర్క్షైర్ హాత్వే కొత్త CEOగా గ్రెగ్ అబెల్ బాధ్యతలు చేపట్టారు. 2026 సంవత్సరానికి ఆయన వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.208 కోట్లు)గా నిర్ణయించారు. ఇది గతంతో పోలిస్తే 19 శాతం ఎక్కువ కావడం విశేషం. బఫెట్ కంటే ఎక్కువ వేతనం పొందడం చర్చనీయాంశంగా మారింది. వైస్ ఛైర్మన్గా సేవలందించిన అబెల్, ఇప్పుడు బెర్క్షైర్లో కీలక బాధ్యతలు చేపట్టారు.
News January 12, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


