News December 4, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* TG: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరిగింది: సీఎం రేవంత్
* విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసే కాలేజీలపై చర్యలు: మంత్రి కోమటిరెడ్డి
* ఏడాది పాలనలో కాంగ్రెస్ 60% మార్కులతో పాస్: కూనంనేని
* AP: ఆస్తులను లాగేసుకోవడం వైసీపీ ట్రెండ్: చంద్రబాబు
* ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం: మంత్రి లోకేశ్
* ఏపీ పీఎం ఆవాస్ యోజన 1.0 ఇళ్ల నిర్మాణ గడువు పెంపు

Similar News

News March 5, 2026

జగన్ క్రిస్టియనా, కాదా? అచ్చెన్న వ్యాఖ్యలతో సభలో దుమారం

image

AP: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇవాళ కూడా శాసనమండలిని కుదిపేస్తోంది. జగన్ క్రిస్టియనా కాదా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నిన్న కూడా సభలో తాను ప్రశ్నించానని, 24 గంటలు గడిచినా జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అచ్చెన్న కామెంట్స్‌ను వ్యతిరేకిస్తూ YCP సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళంతో ఛైర్మన్ మోషేన్ రాజు సభను 5 నిమిషాలు వాయిదా వేశారు.

News March 5, 2026

ఇంటర్ తర్వాత ఏయే కోర్సులున్నాయంటే?

image

ఇంటర్‌లో MPC, BiPC, CEC, HEC, MEC చదివినవారు తర్వాత ఏం చేస్తే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందో తెలుసుకుందాం. MPC చదివినవారు ఇంజినీరింగ్ వైపు వెళ్లాలనుకుంటే EAPCET రాసి బీటెక్ (B.Tech)లో చేరవచ్చు. ప్రస్తుతం ఐటీ రంగంలో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ (ECE) వంటి కోర్సులు తీసుకోవచ్చు. సివిల్, మెకానికల్ విభాగాల్లోనూ మంచి అవకాశాలున్నాయి. రేపు 2PMకు BiPC గురించి..

News March 5, 2026

డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో 10 సైంటిస్ట్ C పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 14 ఆఖరు తేదీ. PhD(లైఫ్ సైన్స్/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్/అగ్రికల్చరల్/ వెటర్నరీ సైన్సెస్), MD అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.dbtindia.gov.in