News December 23, 2024
నేటి ముఖ్యాంశాలు
* అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి
* సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి తుమ్మల
* హీరో థియేటర్‌కు వచ్చేందుకు మేం పర్మిషన్ ఇవ్వలేదు: పోలీసులు
* అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
* డ్రోన్లతో ఏపీ సీఎం నివాసంలో పహారా
* సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది: పల్లా
* అల్లు అర్జున్ అరెస్ట్ సరికాదు: పురందీశ్వరి
Similar News
News December 23, 2024
సంక్రాంతికి జైలర్-2 ప్రకటన?
నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రజినీకాంత్ హీరోగా జైలర్-2 స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. ప్రీప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. ఇందుకోసం సూపర్ స్టార్‌తో మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రికార్డ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో ‘కూలీ’ చిత్రీకరణ జరుగుతోంది.
News December 23, 2024
సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం: విజయశాంతి
TG: సంధ్య థియేటర్ ఘటనపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ‘ఓ సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట ఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చేలా కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేలా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రుల ఆరోపణలు గర్హనీయం’ అని ట్వీట్ చేశారు.
News December 23, 2024
వరుసగా 3 డకౌట్స్.. పాక్ ఓపెనర్ చెత్త రికార్డు
పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు నమోదు చేశారు. 3 వన్డేల సిరీస్‌లో మూడుసార్లు డకౌట్ అయిన తొలి ఓపెనర్‌గా అపఖ్యాతి మూటగట్టుకున్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో అతను అన్ని మ్యాచుల్లోనూ సున్నాకే వెనుతిరిగారు. గతంలో మార్టిన్ గప్టిల్ 7 వన్డేల సిరీస్‌లో వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యారు. నాన్ ఓపెనర్ సూర్యకుమార్ ఆసీస్‌తో సిరీస్‌లో హ్యాట్రిక్ గోల్డెన్ డకౌట్స్ నమోదు చేశారు.