News January 27, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* 4 కొత్త పథకాలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
* అనర్హులకు పథకాలు వస్తే మధ్యలోనే ఆపేస్తాం: మంత్రి పొంగులేటి
* తెలుగు రాష్ట్రాల గవర్నర్ల ‘ఎట్ హోం’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంలు
* AP: కూటమి కోసం బాధ్యతగా ఉండాలని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపు
* దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు
* ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ

Similar News

News December 1, 2025

ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

image

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.

News December 1, 2025

ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చు చేస్తున్నా..: JP

image

మన దేశంలో డిగ్రీ పట్టాలు చిత్తు కాగితాలతో సమానమని, 90% సర్టిఫికెట్లు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని జయప్రకాశ్ నారాయణ ఓ ప్రోగ్రాంలో అన్నారు. స్కిల్ లేకుండా పట్టాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్ష ఖర్చు చేస్తున్నా కనీస విద్యాప్రమాణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో పాసైన వారిలో 20% విద్యార్థులకే సబ్జెక్టుల్లో మినిమమ్ నాలెడ్జ్ ఉంటుందని తెలిపారు.

News December 1, 2025

ఐటీ జాబ్ వదిలి.. ఆవులతో రూ.2 కోట్ల టర్నోవర్!

image

పని ఒత్తిడితో రూ.లక్షల జీతం వచ్చే IT కొలువు కన్నా, గోవుల పెంపకమే మేలనుకున్నారు అహ్మదాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మాల్డే, చార్మి దంపతులు. జాబ్ వదిలి, 2014లో 4 ఆవులను కొని వాటి పాలు, పేడతో ఆర్గానిక్ ఉత్పత్తులు తయారుచేసి అమ్మారు. కల్తీలేని గోఉత్పత్తులకు డిమాండ్ పెరగ్గా మరిన్ని ఆవులను కొన్నారు. కట్ చేస్తే 2024 నాటికి రూ.2 కోట్ల టర్నోవర్ సాధించారు. వారి సక్సెస్‌కు కారణాల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.