News January 30, 2025
నేటి ముఖ్యాంశాలు

☛ మహా కుంభమేళాలో తొక్కిసలాట.. 30 మంది మృతి
☛ కుంభమేళా తొక్కిసలాటపై నేతల దిగ్భ్రాంతి
☛ ISRO 100వ ప్రయోగం సక్సెస్
☛ APలో రేపటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్
☛ పెద్దిరెడ్డి ఆక్రమణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
☛ ఫిబ్రవరి 10లోపు టూరిజం పాలసీ: రేవంత్ రెడ్డి
☛ రేపు BRS రాష్ట్ర వ్యాప్త నిరసనలు
☛ రేషన్ కార్డులపై మోదీ ఫొటో ఉండాలి: బండి సంజయ్
☛ భారీగా పెరిగిన బంగారం ధరలు
Similar News
News November 20, 2025
అదును తప్పిన పైరు.. ముదిమిలో బిడ్డలు ఒక్కటే

ఏ పంటకైనా అదును(అనుకూల సమయం) ముఖ్యం. సరైన సమయానికి విత్తనం వేయకపోతే పంట సరిగా రాదు, దాని వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ముసలి వయసులో పిల్లలు పుడితే, వారు తల్లిదండ్రులకు అండగా నిలబడలేరు లేదా వారికి సేవ చేయలేరు. ఈ రెండూ సమయానికి చేయని పనులు లేదా నిష్ప్రయోజనమైన పరిస్థితులను తెలియజేస్తాయి.
News November 20, 2025
హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.
News November 20, 2025
శబరిమల భక్తులకు అలర్ట్!

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.


