News January 31, 2025
నేటి ముఖ్యాంశాలు

* ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన లోకేశ్
* గెలవగానే టీడీపీ భరతం పడతాం: పెద్దిరెడ్డి
* ప్రత్యేక హోదా అడగడానికి ఇబ్బందేంటి?: షర్మిల
* FEB 7న TG అసెంబ్లీ ప్రత్యేక సమావేశం!
* HT లేకున్నా పరీక్షకు అనుమతించాలి: TG ఇంటర్ బోర్డు
* పేరుకు తగ్గట్టుగానే INC 420 హామీలిచ్చింది: జగదీశ్ రెడ్డి
* పెరిగిన బంగారం, వెండి ధరలు
* వాషింగ్టన్ విమాన ప్రమాదంలో 64 మంది మృతి
* కోహ్లీ మ్యాచ్.. స్వల్ప తొక్కిసలాట
Similar News
News November 14, 2025
WTC ఫైనల్లో టాస్ గెలుస్తాం: గిల్

టెస్టుల్లో మరోసారి టాస్ ఓడిపోవడంపై టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫన్నీగా స్పందించారు. SAతో తొలి టెస్టులో టాస్ ఓడిన అనంతరం ‘నేను టాస్ గెలవబోయే ఏకైక మ్యాచ్ WTC ఫైనలే కావొచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఆయన 8 టెస్టులకు కెప్టెన్సీ చేయగా, 7 మ్యాచుల్లో టాస్ ఓడారు. అటు సౌతాఫ్రికా 2015 తర్వాత భారత్ గడ్డపై టెస్టుల్లో తొలిసారి టాస్ గెలిచింది. ప్రస్తుతం SA ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 66/2గా ఉంది.
News November 14, 2025
ఇక బెంగాల్ వంతు: కేంద్ర మంత్రి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, ఇక తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘అరాచక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బిహార్ నిర్ణయించుకుంది. ఇక్కడి యువత తెలివైనది. ఇది అభివృద్ధి సాధించిన విజయం. బెంగాల్లో అరాచక ప్రభుత్వం ఉంది. అక్కడా మేం గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
News November 14, 2025
4 రౌండ్లు ముగిసే సరికి ఆధిక్యంలో కాంగ్రెస్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. నాలుగో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 9వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 4 రౌండ్లలోనూ ఆయన లీడ్ సాధించారు. BRSకు మూడో రౌండ్లోని ఒక EVMలో స్వల్ప ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం ఐదో రౌండ్ ఓట్లు లెక్కిస్తున్నారు.


