News February 2, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* రూ.50.65లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
* ఇది 140కోట్ల మంది ఆశల బడ్జెట్: PM మోదీ
* రూ.12 లక్షల వరకు నో IT
* బడ్జెట్‌ను స్వాగతించిన CBN, పవన్
* APలో మరో 7 ఎయిర్‌పోర్టులు: రామ్మోహన్
* AP పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ABV
* లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ అందుకున్న సచిన్
* TGకు బడ్జెట్లో మొండిచెయ్యి: హరీశ్ రావు
* 5న TG క్యాబినెట్ భేటీ, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

Similar News

News February 2, 2025

16 మంది ఎంపీలున్న చంద్రబాబు ఏం సాధించారు?: బుగ్గన

image

కేంద్ర బడ్జెట్‌లో APకి నిధులు రాబట్టడంతో CM చంద్రబాబు విఫలమయ్యారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. 12 మంది MPలతోనే బిహార్ CM నితీశ్ అధిక నిధులు సాధించారని, 16 మంది MPలున్నప్పటికీ CBN అసమర్థుడిగా మిగిలారని మండిపడ్డారు. ‘పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేశారు. నిర్మాణంలో ఉన్న పోర్టులకు నిధులు కోరలేదు. మెడికల్ కాలేజీల విషయంలోనూ నిర్లక్ష్యం వహించారు’ అని దుయ్యబట్టారు.

News February 2, 2025

రేటింగ్ కోసం లంచాలు.. KL యూనివర్సిటీపై కేసు

image

AP: గుంటూరు జిల్లాలోని KL యూనివర్సిటీపై CBI కేసు నమోదు చేసింది. NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా 20 చోట్ల విద్యాసంస్థల్లో సోదాలు చేపట్టి యూనివర్సిటీ ఉద్యోగులు, NAAC సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. నగదు, బంగారం, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు గుర్తించింది. రూ.37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, పలు డాక్యుమెంట్లను CBI స్వాధీనం చేసుకుంది.

News February 2, 2025

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: అడిగిన జీతం ఇవ్వని గర్వంతో కూడిన యజమాని వద్ద ఉండటం కంటే వేగంగా పోయే ఎద్దులను నాగలికి కట్టుకుని వ్యవసాయం చేయడం మంచిది.