News June 25, 2024
నేటి ముఖ్యాంశాలు

* పార్లమెంటు సమావేశాలు ప్రారంభం.. ఎంపీల ప్రమాణస్వీకారం
* AP: కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం
* సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ: మంత్రి పార్థసారథి
* వాలంటీర్లకు ఇచ్చే అలవెన్స్ రద్దు చేసిన ప్రభుత్వం
* కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలి: జగన్
* TG: బీఆర్ఎస్ పని ఖతం: షబ్బీర్ అలీ
* ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
* సెమీఫైనల్కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా
Similar News
News January 9, 2026
నా మాటలే సున్నితం.. చేతలు గట్టిగా ఉంటాయి: పవన్

AP: ప్రజలను అభద్రతాభావానికి గురిచేసేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. తన మాటలు సున్నితంగా ఉన్నా చేతలు గట్టిగా ఉంటాయని హెచ్చరించారు. ‘అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శను స్వాగతిస్తా. కానీ కులాలు, మతాల మధ్య గొడవ పెట్టాలని చూస్తే నేను వ్యక్తిగతంగా ఫోకస్ చేస్తా. సీఎం, నాతో సహా ఎవరూ వ్యవస్థకు అతీతం కాదు. నాకు ముందుకెళ్లే ఆలోచన తప్ప ఓటమి భయం లేదు’ అని చెప్పారు.
News January 9, 2026
గత పాలకులు ఏమీ చేయకుండా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు: పవన్

AP: పనిచేసే నాయకులకు అండగా నిలవాలని Dy.CM పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. గత పాలకులు ఏమీ చేయకుండా తమను ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో ఏ చిన్న విషయం జరిగినా దారుణం జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏదైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా తేలికని, నిర్మించడమే కష్టమని పేర్కొన్నారు.
News January 9, 2026
‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపుపై HCలో పిటిషన్

TG: ప్రభాస్ ‘రాజాసాబ్’ టికెట్ ధరల <<18804706>>పెంపును<<>> సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది శ్రీనివాస్ దీన్ని సింగిల్ బెంచ్ జడ్జి వద్ద మెన్షన్ చేశారు. అర్ధరాత్రి టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం మెమో ఇచ్చిందని పేర్కొన్నారు. పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. కాగా నిన్న టికెట్ రేట్లు పెంచకపోవడంతో మేకర్స్ ప్రీమియర్స్ రద్దు చేశారు. చివరికి అర్ధరాత్రి ప్రభుత్వం జీవో జారీ చేసింది.


