News May 7, 2025

ఈనాటి ముఖ్యాంశాలు

image

* మోదీజీ POKను హిందూస్థాన్‌లో కలిపేయండి: సీఎం రేవంత్
* రాయలసీమ అభివృద్ధిపై PMతో చంద్రబాబు ప్రత్యేక చర్చ
* మంత్రుల ఫోన్లను రేవంత్ ట్యాప్ చేస్తున్నారు: KTR
* పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. అమిత్ షా
* అవును.. ఉగ్రవాదుల్ని పెంచి పోషించాం: పాక్ రక్షణ మంత్రి
* కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన ఆర్మీ
* ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూత
* ఐపీఎల్‌లో CSKపై SRH విజయం

Similar News

News March 21, 2026

మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

image

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్‌కతాలోని ఈద్ ఈవెంట్‌‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

News March 21, 2026

7 కేజీల బరువు తగ్గా: శ్రేయస్

image

గాయం కారణంగా గతేడాది తనకు కష్టంగా గడిచిందని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. దాదాపు 7KGల బరువు తగ్గినట్లు తెలిపారు. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరువు పెరిగి ఫిట్‌నెస్ సాధించడానికి తీవ్రంగా కష్టపడినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమన్నారు. ‘2025 IPLలో రన్నరప్‌గా నిలిచాం. ఈ ఏడాది మా జట్టుపై భారీ అంచనాలున్నాయి. నా కన్ను ట్రోఫీపైనే ఉంది’ అని పేర్కొన్నారు.

News March 21, 2026

ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

image

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్ర‌మంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.