News April 23, 2025

ఈరోజు నమాజ్ వేళలు(ఏప్రిల్ 23, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.40 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.55 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.14 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.34 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News August 7, 2025

రాజగోపాల్‌ రెడ్డికి నోటీసులు?

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే బహిరంగ విమర్శలు చేస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజగోపాల్‌ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి భేటీ కానున్నారు. రేవంత్‌పై విమర్శల మీద వివరణ కోరనున్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

News August 7, 2025

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తింటే ఎన్ని లాభాలో..

image

ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుందని, దీని వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందని తెలిపారు. అలాగే B12, D, A, E, B6 విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కండరాల బలం, కంటి చూపు, మెదడు, కాలేయం ఆరోగ్యం కోసం ఇవి ఎంతో ముఖ్యం. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారంతో కలిపి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
SHARE IT

News August 7, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్‌పైనే అత్యధికం!

image

మిత్ర దేశం అంటూనే భారత్‌పై ట్రంప్ టారిఫ్స్ యుద్ధం ప్రకటించారు. <<17326848>>ఇష్టారీతిన<<>> సుంకాల(50%)తో విరుచుకుపడుతున్నారు. భవిష్యత్తులోనూ ఇంకా పెంచుతానని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్(50%), భారత్ మాత్రమే అత్యధిక టారిఫ్స్ ఎదుర్కొంటున్నాయి. ఆ తర్వాత స్విట్జర్లాండ్(39%), కెనడా(35%), చైనా(30%) ఉన్నాయి. ట్రంప్ చర్యలతో US, భారత్ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరు దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.