News August 21, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 21, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.45 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.00 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.46 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.38 గంటలకు
✒ ఇష: రాత్రి 7.53 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News August 21, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పలువురు కీలక నేతలతో రేవంత్ భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News August 21, 2025
నేడు మంత్రివర్గ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రూ.904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఆమోదం పలకనుందని సమాచారం. కొత్త జిల్లాల పేర్లు మార్పు, ఏర్పాటుపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
News August 21, 2025
టీమ్ ఇండియా మేనేజర్‌గా జనసేన MLA కుమారుడు

ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేనేజర్‌గా ఆంధ్రాకు చెందిన పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ప్రశాంత్ ప్రస్తుతం ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా టీమ్ ప్లేయర్‌గా రాణించారు. కాగా భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడే ప్రశాంత్. అలాగే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు అల్లుడు కూడా. ఈ నెల 9 నుంచి 28 వరకు ఆయన టీమ్ ఇండియాతో పర్యటించనున్నారు.