News August 23, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 23, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.46 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.36 గంటలకు
✒ ఇష: రాత్రి 7.51 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 6, 2026
యుద్ధం.. ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన మరో కీలక నేత మృతి చెందారు. IRGC ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమీ మరణించినట్లు సోమవారం ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించింది. అయితే ఎప్పుడు, ఎక్కడ చనిపోయారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. సోమవారం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసిన విషయం తెలిసిందే.
News April 6, 2026
భర్తను కాదని నచ్చిన వాడితో ఉండేందుకు అనుమతించిన కోర్టు

పెళ్లయిన 19 ఏళ్ల మహిళ తన భర్త, తల్లిదండ్రులతో ఉండటానికి నిరాకరించిన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల భర్త నుంచి విడిపోయి, తనకిష్టమైన భాగస్వామితో ఉంటానన్న ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. మేజర్ అయిన వ్యక్తికి తన ఇష్టప్రకారం జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా, ఫ్యామిలీ ఒత్తిడి చేసినా సదరు మహిళ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం గమనార్హం.
News April 6, 2026
ఇవాళ లేదా రేపు అమరావతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!

AP: అమరావతి చట్టబద్ధత బిల్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఇవాళ లేదా రేపు ప్రెసిడెంట్ దానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులతో పరిశీలన అనంతరం ఆమోదం తెలపనున్నారు. దీంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఆ తర్వాత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.


