News October 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 06, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.22 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.13 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 6, 2025

పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌.. భారత్‌కు 22 మెడల్స్

image

ఢిల్లీలో వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ముగిశాయి. భారత్ 22 పతకాలను (6 గోల్డ్, 9 సిల్వర్, 7 బ్రాంజ్) గెలుచుకుంది. పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా ఈ ఛాంపియన్‌షిప్‌‌లో 100కు పైగా దేశాల నుంచి 2,200 మందికి పైగా అథ్లెట్లు పోటీ పడ్డారు. ఖతార్, UAE, జపాన్ తర్వాత వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించిన నాలుగో ఆసియా దేశంగా IND నిలిచింది.

News October 6, 2025

₹300Cr క్లబ్‌లోకి ‘లోక: ఛాప్టర్-1’.. OTTలోకి ఎప్పుడంటే?

image

కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ నటించిన ‘లోక: ఛాప్టర్-1’ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీపావళి కానుకగా OTTకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

News October 6, 2025

AUS-Aపై IND-A విజయం.. సిరీస్ కైవసం

image

ఆస్ట్రేలియా-Aతో జరిగిన అన్‌అఫీషియల్ మూడో వన్డేలో ఇండియా-A 2 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత AUS 317 రన్స్‌కు ఆలౌటైంది. అర్ష్‌దీప్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు, బదోని 2 వికెట్లు తీశారు. అనంతరం IND 46 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ప్రభ్‌సిమ్రాన్ (102), శ్రేయస్ (62), రియాన్ పరాగ్ (62) రాణించారు. తిలక్ (3), అభిషేక్ (22) నిరాశపరిచారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.