News September 13, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 13, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
✒ ఇష: రాత్రి 7.32 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 31, 2026
సంజూ.. సొంత గడ్డపైనా ఫెయిల్

భారత బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి విఫలం అయ్యారు. సొంతగడ్డ తిరువనంతపురంలోనూ రన్స్ చేయలేకపోయారు. NZతో చివరి టీ20లో 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సిరీస్‌లో సంజూ 10, 6, 0, 24, 6 స్కోర్లతో కేవలం 46 రన్స్ మాత్రమే చేశారు. మరి ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్ తుది జట్టులో సంజూకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
News January 31, 2026
యాడ్స్‌లో ‘కింగ్’ నంబర్-1.. రెండో స్థానంలో మిస్టర్ కూల్

ఇండియన్ అడ్వర్టైజింగ్ స్క్రీన్ టైమ్‌లో 8% వాటాతో కింగ్ ఖాన్ షారుఖ్ నంబర్-1 స్థానంలో నిలిచినట్లు మార్కెటింగ్ మైండ్ సంస్థ వెల్లడించింది. అన్ని ఛానళ్లలో కలిపి రోజుకు సగటున 27 గంటలపాటు ఆయన యాడ్స్ ప్రసారమవుతున్నాయని తెలిపింది. రెండో స్థానంలో ధోనీ(రోజుకు 22Hr యాడ్స్) ఉన్నారని పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అక్షయ్, రణ్‌వీర్ సింగ్, అమితాబ్, అనన్య, రణ్‌బీర్ కపూర్, అనుష్కా శర్మ, ద్రవిడ్, కోహ్లీ ఉన్నారంది.
News January 31, 2026
వారంలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు

AP: తిరుపతికి చెందిన బయ్యాల చాందిని వారం వ్యవధిలోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఆమె బుధవారం జుడీషియల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. 2 రోజుల క్రితం గ్రూప్-2లో జాబ్ వచ్చింది. తాజాగా శుక్రవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో DSP క్యాడర్ పోస్ట్‌కు ఎంపికయ్యారు. ఆమె తండ్రి భాస్కర్ TTD రిసెప్షన్-1 డిప్యూటీ EOగా పని చేస్తున్నారు. కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని చాందిని నిరూపించారు.


