News September 25, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 25, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.22 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News September 25, 2025

ఒత్తిడి చాలా ప్రమాదకరం: అక్షయ్ కుమార్

image

నేటి ప్రపంచంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలతో ప్రెషర్‌కు గురై జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దని ఓ షోలో చెప్పారు. సాదాసీదాగా జీవితాన్ని గడపాలని సూచించారు. తాను అందరిలాగే సెలవులు తీసుకుంటానని, ఏడాదిలో 125 రోజులు బ్రేక్‌లో ఉంటానని పేర్కొన్నారు. ఆదివారాలు, సమ్మర్ వెకేషన్, దీపావళికి 3 రోజులు సెలవులో ఉంటానని పేర్కొన్నారు. సమయపాలన పాటించడం చాలా ముఖ్యమన్నారు.

News September 25, 2025

ఆసియాకప్‌లో భారత్‌దే హవా

image

ఆసియాకప్‌లో 1984 నుంచి టీమ్ఇండియాదే హవా కొనసాగుతోంది. మొత్తం 17 ఎడిషన్లలో 12 సార్లు <<17820873>>ఫైనల్<<>> చేరింది. ఇప్పటివరకు 8 సార్లు విజేతగా, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇవాళ జరిగే పాక్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విజేతతో ఈ నెల 28న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. అటు ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో భారత ఓపెనర్ అభిషేక్(248), వికెట్ల జాబితాలో బౌలర్ కుల్దీప్(12w) తొలి స్థానాల్లో ఉన్నారు.

News September 25, 2025

సెప్టెంబర్ 25: చరిత్రలో ఈ రోజు

image

1920: ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జననం(ఫొటో)
1939: బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం
1974: ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ జననం
1958: స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీనారాయణ మరణం
2019: హాస్యనటుడు వేణుమాధవ్ మరణం
2020: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం మరణం
➣వరల్డ్ ఫార్మాసిస్ట్ డే