News July 4, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 04, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:25 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:46 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు అసర్: సాయంత్రం 4:57 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు ఇష: రాత్రి 8.16 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News November 6, 2025

జీవితం సంతోషంగా మారాలంటే..?

image

రాగద్వేషాలను వదిలిపెట్టి, మన ఇంద్రియాలకు సాక్షిగా ఉన్న ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించాలి. అలా మనం ఏకాగ్రతతో ఆయనపై భక్తి చూపి, ధ్యానం చేసినప్పుడు, ఈ దేహమే నేను అనే అహంకారం నశించిపోతుంది. దేహాభిమానం తొలగిపోతుంది. అప్పుడు సుఖదుఃఖాలు మనల్ని బాధించవు. ఇక బయటి ఆలోచనలు, కోరికలు పక్కన పెట్టాలి. మనసును పరమాత్మపై లగ్నం చేయాలి. ఫలితంగా నిజమైన శాంతి, ఆత్మనిర్భరత లభిస్తాయి. అప్పుడే జీవితం సంతోషమయం. <<-se>>#WhoIsGod<<>>

News November 6, 2025

చాప్‌మన్ విధ్వంసం.. 28 బంతుల్లో 78 రన్స్

image

విండీస్‌తో రెండో T20లో కివీస్ బ్యాటర్ చాప్‌మన్ విధ్వంసం సృష్టించారు. 28 బంతుల్లోనే 78 పరుగులు చేశారు. ఇందులో 7 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో NZ తరఫున ఒక T20Iలో అత్యధిక స్ట్రైక్‌రేటు(279)తో బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో కివీస్ 20 ఓవర్లలో 207-5 స్కోర్ చేయగా, WI 204-8 స్కోరుకు పరిమితమై ఓడిపోయింది. పావెల్ 45(16B), షెఫర్డ్ 34(16B), ఫోర్డే 29(13B) రన్స్ చేసినా ఫలితం లేకపోయింది.

News November 6, 2025

న్యూక్లియర్ సెక్టార్‌లోకి ఏఐ రోబోట్

image

అన్ని రంగాల్లోకి ఏఐ టెక్నాలజీ విస్తరిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారి న్యూక్లియర్ సెక్టార్‌లో AI హ్యూమనాయిడ్ రోబోట్‌ను రూపొందించినట్లు న్యూక్లియర్ సంస్థ ఒరానో(ఫ్రాన్స్), టెక్నాలజీ కంపెనీ క్యాప్‌జెమినీ ప్రకటించాయి. హోక్సో అనే పేరు కలిగిన ఈ రోబోట్ ఏఐ, నావిగేషన్, టెక్నికల్ ఆదేశాల అమలు, అడ్వాన్స్‌డ్ సెన్సార్లను కలిగి ఉందని తెలిపాయి. న్యూక్లియర్ కేంద్రాల్లో మానవులతో కలిసి పనిచేస్తుందన్నాయి.