News July 11, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: జులై 11, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:28 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:49 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:57 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:55 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News March 26, 2026
రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కళ్యాణం జరగనుంది.
News March 26, 2026
మా అనుభవాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం: సైనా నెహ్వాల్

తామిద్దరం విడిపోతున్నామని ప్రకటించి బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కశ్యప్ గతేడాది వార్తల్లో నిలిచారు. అయితే కొన్నాళ్లకే కలిసిపోతున్నట్లు వెల్లడించారు. దీనిపై సైనా తాజాగా స్పందించారు. ‘బంధాల్లో విభేదాలు సహజం. వాటిని ఎలా పరిష్కరించుకుంటామనేదే అత్యంత ముఖ్యం. కమ్యూనికేషన్, నమ్మకం, పరస్పర గౌరవం, సహనం అవసరం. మా అనుభవాల నుంచి మేం నేర్చుకుంటూనే ఉన్నాం’ అని NDTV ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
News March 26, 2026
అయ్యో.. పాపం!

AP: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఒక్కొక్కరి దీనగాథ హృదయ విదారకంగా ఉంది. కనిగిరి(M) మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45) తన కొడుకు మనోహర్‌ను కాపాడి తాను మరణించారు. కొనకనమిట్ల(M) పెదారికట్లకు చెందిన అంబటి అనిల్, 5 నెలల కొడుకు చనిపోగా అతని భార్య సౌజన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.


