News July 13, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: జులై 13, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:49 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.15 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 5, 2025
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర క్రికెట్ ఫ్యాన్స్ను విశాఖలో 2 నెలల వ్యవధిలో జరిగే 4 అంతర్జాతీయ మ్యాచులు అలరించనున్నాయి. డిసెంబర్ 6న ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే విశాఖ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. Dec 21న INDWvsSLW మధ్య టీ20, Dec 23న ఈ రెండు జట్ల మధ్యే మరో టీ20 జరగనుంది. కొత్త ఏడాది జనవరి 28న INDvsNZ జట్లు టీ20 ఆడనున్నాయి. ఇలా వరుసగా ఇంటర్నేషనల్ మ్యాచులకు విశాఖ వేదిక కానుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News December 5, 2025
ఇండిగో.. ఒక్కరోజే 550 విమానాల రద్దు

నిన్న 550 విమానాలను రద్దు చేసిన ఇండిగో ఎయిర్లైన్స్ మరో 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో DGCAకు నివేదిక ఇచ్చింది. ఫేజ్-2 ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(FDTL) ప్రకారం సిబ్బంది లేక సర్వీసులు రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పింది. నిబంధనల అమలులో పొరపాట్లు, ప్లానింగ్ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తిందని తెలిపింది. ఇండిగో రోజుకు దాదాపు 2,300 ఫ్లైట్లను నడుపుతోంది.
News December 5, 2025
CEOలనూ AI వదలదు: రచయిత స్టువర్ట్

ఫ్యూచర్లో CEO ఉద్యోగాలనూ AI లాగేసుకునే ఛాన్స్ ఉందని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ మోడ్రన్ అప్రోచ్’ పుస్తక సహ రచయిత స్టువర్ట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు. AIకి నిర్ణయాధికారం ఇవ్వాలని లేదంటే తప్పుకోవాలని బోర్డు సభ్యులు CEOను డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. పని అనుకునే ప్రతి దాన్నీ AI చేసేస్తోందన్నారు. ఇప్పటికే కార్మికులు, డ్రైవర్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు నష్టపోతున్నామనే చర్చ జరుగుతోంది.


