News March 28, 2024
ఈ రోజు నమాజ్ వేళలు

తేది: మార్చి 28, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:01
సూర్యోదయం: ఉదయం గం.6:14
జొహర్: మధ్యాహ్నం గం.12:21
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:29
ఇష: రాత్రి గం.07.41
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 26, 2026
బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాల్లో హిందువులకి మాత్రమే ప్రవేశం!

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించేందుకు ఆలయ కమిటీ (BKTC) సిద్ధమైంది. చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఈ టెంపుల్స్‌తో పాటు, కమిటీ ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్‌లో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది. ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయం తెరుచుకోనుంది.
News January 26, 2026
పిల్లల్లో కవాసకి వ్యాధితో గుండెకు ముప్పు

శరీర రోగనిరోధకవ్యవస్థ ఆరోగ్యకరమైన కణజాలాలపై దాడి చేయడాన్నే కవాసకి వ్యాధి అంటారు. దీనివల్ల కొరోనరీ ధమనులు, గుండె కండరాలపై ప్రభావం పడుతుంది. చిన్నారుల్లో ఈ వ్యాధి ఉంటే 5 రోజులకు పైగా జ్వరం, దద్దుర్లు, కళ్ళు ఎర్రబడడం, పెదవులు పగలడం, నాలుక ఎర్రగా మారడం, చేతులు, కాళ్లలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 5 సంవత్సరాల్లోపు పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
News January 26, 2026
TGలోనూ ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు: లక్ష్మణ్

TG: దేశవ్యాప్తంగా జనగణన 6 నెలల్లోనే పూర్తవుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్‌తోపాటు ఇతర ప్రక్రియ అంతా ఎన్నికలలోపే పూర్తవుతాయన్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.


