News July 19, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: జులై 19, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:32 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:51 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:55 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:53 గంటలకు
ఇష: రాత్రి 8.13 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 23, 2025
రోజూ యాలకులు తింటున్నారా!
ప్రతి రోజు యాలకులను నమిలి రసం మింగితే పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయని అంటున్నారు. అలాగే యాలకులను డైలీ తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తశాతం పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. యాలకులను తినడం వల్ల రక్తశుద్ధి జరిగి విష, వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి.
News January 23, 2025
మ్యాచ్ టికెట్ ఉంటే.. మెట్రోలో ఉచిత ప్రయాణం
భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో T20 ఈ నెల 25న చెన్నైలో జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA) కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ టికెట్ ఉన్న వారికి మెట్రోలో ఫ్రీగా ప్రయాణించే అవకాశం కల్పించింది. చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా.. స్టేడియానికి రావడానికి, వెళ్లడానికి మెట్రోలో టికెట్ అవసరం లేదని స్పష్టం చేసింది. 2023 ఐపీఎల్ మ్యాచ్ల సమయంలోనూ TNCA ఇలా మెట్రో టికెట్ ఫ్రీ ఆఫర్ కల్పించింది.
News January 23, 2025
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఈయనే..
2025 గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో రానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్లో ఇండోనేషియాకు చెందిన 160మందితో కూడిన కవాతు, 190 మంది సభ్యుల బ్యాండ్ బృందాలు భారత సైనికులతో కలిసి కవాతు నిర్వహించనున్నాయి. 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. గతేడాది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ హాజరైన విషయం తెలిసిందే.