News July 25, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: జులై 25, గురువారం ఫజర్: తెల్లవారుజామున 4:34 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:53 గంటలకు జొహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు అసర్: సాయంత్రం 4:54 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6:52 గంటలకు ఇష: రాత్రి 8.11 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News November 27, 2025
వేములవాడ: ‘ఆగిపోయిన రోడ్డు పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తాం’

వేములవాడలో ఆగిపోయిన 4 లేన్ల రోడ్డు పనులను వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామని R&B DE శాంతయ్య తెలిపారు. రూ. 9.65 కోట్ల అంచనా వ్యయంతో 2022-2023లో ప్రారంభించి అర్ధాంతరంగా ఆగిపోయిన పనులను గురువారం పున ప్రారంభించారు. చెక్కపల్లి బస్టాండ్ నుంచి కోరుట్ల బస్టాండ్ వరకు 600 మీటర్లు, రాజన్న ఆలయం ముందువైపు మెట్ల నుంచి జగిత్యాల కమాన్ వరకు 700 మీటర్లు డివైడర్తో కూడిన 4 లేన్ల రోడ్డు నిర్మిస్తున్నామని తెలిపారు.
News November 27, 2025
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.
News November 27, 2025
తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిరోజు 3,242 సర్పంచ్, 1,821 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలిస్తారు. డిసెంబర్ 3 వరకు విత్డ్రాకు అవకాశం ఉంటుంది. తొలి దశలో 4,236 గ్రామాలకు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. కాగా తొలి విడత పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.


