News July 26, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: జులై 26, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 4:35 గంటలకు, సూర్యోదయం: ఉదయం 5:54 గంటలకు, జొహర్: మధ్యాహ్నం 12:23 గంటలకు, అసర్: సాయంత్రం 4:53 గంటలకు, మఘ్రిబ్: సాయంత్రం 6:51 గంటలకు, ఇష: రాత్రి 8.10 గంటలకు. నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 6, 2025
పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లూ కీలకం

పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకమంటున్నారు నిపుణులు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు.
News December 6, 2025
DANGER: పబ్లిక్ వైఫై వాడుతున్నారా?

పబ్లిక్ వైఫై సేవలు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల సైబర్ మోసగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘అత్యవసరమైతేనే వైఫై వాడండి. అపరిచిత వెబ్సైట్స్కు సంబంధించిన పాప్అప్ను పట్టించుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయండి’ అని పిలుపునిచ్చారు.
News December 6, 2025
కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల లక్షణాలు (2/2)

వైరస్ ఆశించిన కొన్ని కూరగాయల మొక్కల ఆకులు ముడతలు పడి, ముడుచుకొని, నిక్కబొడుచుకొని కనిపిస్తాయి. ఆకులు చిన్నగా ఉండి ఆకుపచ్చ రంగు కోల్పోవడం వల్ల మొక్కల్లో ఆహారోత్పత్తి తగ్గి వాడిపోయినట్లుగా ఉంటాయి. వైరస్ ఆశించిన మొక్కల్లో లేత ఆకులు చిన్నగా మారి, పైకి కిందికి ముడుచుకొని వికారంగా మారతాయి. మొక్కల్లో పెరుగుదల లోపించి, కణుపుల మధ్యదూరం తగ్గి గిడసబారి పూత రావడం, కాయకట్టడం తగ్గుతుంది.


