News August 11, 2024
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: ఆగస్టు 11, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:42 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:58 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:44 గంటలకు
✒ ఇష: రాత్రి 8.00 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 20, 2026
అల్లరి నరేశ్ తాత మృతి

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తాత ఈదర వెంకట్రావు(90) కన్నుమూశారు. వెంకట్రావుకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కొడుకు దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ. అల్లరి నరేశ్ తండ్రైన ఈవీవీ 2011లో మరణించిన సంగతి తెలిసిందే. కాగా వెంకట్రావు భౌతికకాయానికి ఇవాళ సాయంత్రం నిడదవోలులోని కోరుమామిడిలో అంత్యక్రియలు జరగనున్నాయి.
News January 20, 2026
తగలబెట్టేయండి.. అమెరికాపై ఫ్రాన్స్ సెటైర్లు!

గ్రీన్‌లాండ్‌పై రష్యా దాడి చేస్తే తాము <<18893308>>జోక్యం చేసుకోవాల్సి<<>> ఉంటుందని, అందుకే ఇప్పుడే స్వాధీనం చేసుకుంటామన్న US వ్యాఖ్యలపై ఫ్రాన్స్ సెటైర్లు వేసింది. ‘అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఫైటర్లు జోక్యం చేసుకుంటారు. అందుకే ఇప్పుడే ఇంటిని తగలబెట్టేయండి. షార్క్ దాడి చేస్తే ఎవరైనా అడ్డుకుంటారు. లైఫ్గార్డును ఇప్పుడే తినేద్దాం. యాక్సిడెంట్ జరిగితే నష్టం కలుగుతుంది. కారును ధ్వంసం చేయండి’ అని ట్వీట్ చేసింది.
News January 20, 2026
22 వేల పోస్టులు.. దరఖాస్తుల తేదీలివే!

22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి ఈ నెల 30న RRB పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 21 నుంచి కాకుండా 31వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మార్చి 2 వరకు గడువు విధించనుంది. టెన్త్, ITI అర్హత కలిగిన, 18-33 ఏళ్ల వయసు వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం ₹18,000 చెల్లిస్తారు.
వెబ్సైట్: www.rrbchennai.gov.in/


