News August 29, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఆగస్టు 29, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:48 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:02 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:17 గంటలకు
అసర్: సాయంత్రం 4:43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:32 గంటలకు
ఇష: రాత్రి 7.46 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు

Similar News

News January 24, 2026

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.

News January 24, 2026

దోపిడీదారుల ప్రయోజనం కోసమే కట్టుకథలు: భట్టి

image

TG: కొంతకాలంగా సింగరేణిపై కట్టుకథలు, అడ్డగోలు రాతలు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాబందులు, గద్దలు, దోపిడీదారుల ప్రయోజనాల కోసమే ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కావాల్సిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకొచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఈ రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అని సందేహం వ్యక్తం చేశారు.

News January 24, 2026

ఇండియాకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టారిఫ్స్?

image

భారతీయ ఉత్పత్తులపై విధిస్తున్న 50% టారిఫ్స్‌ను సగానికి తగ్గించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హింట్ ఇచ్చింది. ‘రష్యా ఆయిల్ కొనుగోలును ఇండియా తగ్గించింది. సుంకాలు ఇంకా అమల్లోనే ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉంటుందని భావిస్తున్నాను’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొంటున్నామనే కారణంతో ఇండియన్ ప్రొడక్ట్స్‌పై US 25% అదనపు సుంకాలు విధిస్తోంది.