News September 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 11, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:37 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:21 గంటలకు
ఇష: రాత్రి 7.34 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 5, 2026

భారత్.. ప్రపంచానికి ఆశాకిరణం: మోదీ

image

ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న సమయంలో ఇండియా ఆశాకిరణంగా మారిందని PM మోదీ అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశాలు వృద్ధాప్యంలోకి వెళ్తున్నాయి. కానీ భారత్ యవ్వనంలోకి వస్తోంది. అధిక వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం మన దగ్గరే ఉన్నాయి. గ్లోబల్ సౌత్ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. గ్లోబల్ సౌత్ గొంతుక ఇండియా’ అని అన్నారు. గతంలో మనతో డీల్స్ చేసుకునేందుకు ఏ దేశమూ రెడీగా లేదని పరోక్షంగా కాంగ్రెస్‌ పాలనను విమర్శించారు.

News February 5, 2026

NIMHANS 52పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

బెంగళూరులోని <>NIMHANS<<>> 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(మాలిక్యులార్ బయాలజీ), డిగ్రీ, డిప్లొమా(క్లినికల్ న్యూరో సైకాలజీ టెక్నాలజీ), MLSc, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nimhans.ac.in

News February 5, 2026

కంచి: బంగారు, వెండి బల్లుల వెనుక రహస్యం

image

కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లుల వెనుక ఓ పురాణ గాథ ఉంది. గౌతమ మహర్షి శిష్యులు శాపంతో బల్లులుగా మారి, ఇక్కడ స్వామివారిని ప్రార్థించి మోక్షం పొందారు. సూర్యచంద్రులకు ప్రతీకగా ఉన్న ఈ బల్లులను తాకితే దోషాలు, బల్లి పడితే కలిగే అరిష్టాలు తొలగుతాయని నమ్మకం. అయితే శేషాచల అడవుల్లో గోల్డెన్ గెక్కో అనే అరుదైన బంగారు రంగు బల్లులు నేటికీ కనిపిస్తాయి. వీటిని తాకితే పాపాలు పోతాయని నమ్మకం.