News September 12, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: సెప్టెంబర్ 12, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:51 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:12 గంటలకు
అసర్: సాయంత్రం 4:36 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:21 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News August 24, 2025
సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

TG: స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 29న జరిగే క్యాబినెట్ భేటీలో స్పష్టత రానుంది. BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. నెలాఖరులో పోలింగ్ జరగొచ్చని సమాచారం. కాగా ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక, న్యాయ సలహా మేరకు ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనుంది.
News August 24, 2025
తుర్కియే, అజర్బైజాన్ దేశాలకు షాకిచ్చిన ఇండియన్స్

‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్కు మద్దతు ఇచ్చిన తుర్కియేకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. గత 3 నెలల్లో భారత పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. ఈ ఏడాది మేలో 31,659 మంది ఇండియన్స్ ఆ దేశంలో పర్యటించగా, జులైలో ఆ సంఖ్య 16,244కి తగ్గింది. ‘ఆపరేషన్ సిందూర్’లో తుర్కియేకు చెందిన డ్రోన్లను పాక్ ఉపయోగించింది. అటు పాక్కు సపోర్ట్ చేసిన అజర్బైజాన్లోనూ భారత పర్యాటకుల సంఖ్య గతేడాది జూన్తో పోలిస్తే 60% తగ్గింది.
News August 24, 2025
ఎల్లుండి నుంచి స్పాట్ అడ్మిషన్లు

TG: JNTUతో పాటు అనుబంధ కాలేజీల్లో మిగిలిపోయిన ఇంజినీరింగ్ సీట్లకు ఈ నెల 26 నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. 26న వర్సిటీ క్యాంపస్, సుల్తాన్పూర్, 28న జగిత్యాల, మంథని, 29న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆయా కాలేజీల్లో సీట్లు కావాల్సిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని అధికారులు సూచించారు.