News September 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: సెప్టెంబర్ 15, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:52 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:04 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:11 గంటలకు
అసర్: సాయంత్రం 4:35 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:18 గంటలకు
ఇష: రాత్రి 7.30 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 26, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*దూసుకొస్తున్న తుఫాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న CM చంద్రబాబు
*తుఫాన్ ఎఫెక్ట్.. APలోని 7 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
*DCCల నియామకంపై KC వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ
*TG ఇంటర్ సిలబస్‌లో సమూల మార్పులు: బోర్డ్
*కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలవనున్న TVK చీఫ్ విజయ్
*ఆస్ట్రేలియాపై వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ విజయం
*వచ్చేనెల నుంచి అందుబాటులోకి ‘భారత్ ట్యాక్సీ’

News October 26, 2025

దేశం పరువును గంగలో కలిపారు.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

image

MPలో ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని, దేశం పరువును గంగలో కలిపారని అధికార BJPపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. CM బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని కావాలనే రాజకీయం చేస్తోందని BJP కౌంటర్ ఇచ్చింది. నిందితుడిపై తక్షణ చర్యలు చేపట్టామని, ఇలాంటి వాటిని సహించేదే లేదని స్పష్టం చేసింది.

News October 26, 2025

వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

image

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్‌లు సిద్ధం చేశామన్నారు.