News April 4, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 4, గురువారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:55
సూర్యోదయం: ఉదయం గం.6:08
జొహర్: మధ్యాహ్నం గం.12:19
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.43
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 8, 2026

SIR రెండో విడతలో 6.5 కోట్ల ఓట్లు తొలగింపు

image

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) రెండో విడతలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితాల నుంచి సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. SIRకు ముందు ఈ రాష్ట్రాల్లో 50.90 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఆ సంఖ్య 44.40 కోట్లకు తగ్గింది. ఇటీవల ఒక్క ఉత్తర్ ప్రదేశ్‌లోనే <<18779886>>2.89కోట్ల మంది<<>> ఓటర్లను తొలగించారు.

News January 8, 2026

అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు

image

AP: రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. మరో పదెకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేడుకలకు గవర్నర్ జస్టిస్ నజీర్, CM చంద్రబాబు సహా 500 మంది అతిథులు హాజరవనున్నారు.

News January 8, 2026

యూరియా తీసుకున్న రైతులపై నిఘా

image

TG: ఒకేసారి 40-50 బస్తాల యూరియా కొనుగోలు చేసిన రైతులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. 4 జిల్లాల్లో అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి రావడంతో క్షేత్రస్థాయి విచారణకు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. రైతుల భూమి విస్తీర్ణం, పంటలు, యూరియా అవసరం, వినియోగాన్ని పరిశీలించనున్నాయి.