News October 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:25 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:05 గంటలకు
ఇష: రాత్రి 7.17 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 20, 2026

ఆర్టీఐ ద్వారా ప్రజలు అడిగిన సమాచారం ఇవ్వాలి: చీఫ్ కమిషనర్

image

AP: ప్రజలు అడిగిన సమాచారాన్ని సమయానికి ఇవ్వకపోతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆర్టీఐ చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలోని ఆర్టీఐ ఆఫీస్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర సమాచారం సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుని అమలు చేస్తామని తెలియజేశారు.

News January 20, 2026

ఒకే రోజు రూ.22వేలు పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే <<18903989>>కేజీ<<>> వెండిపై రూ.22వేలు పెరిగి రూ.3,40,000కు చేరింది. కేవలం 10 రోజుల్లోనే వెండి ధర రూ.65వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలనిచ్చింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,48,370, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,950 ఎగబాకి రూ.1,36,000 పలుకుతోంది.

News January 20, 2026

షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

image

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.