News April 5, 2024
ఈ రోజు నమాజ్ వేళలు

తేది: ఏప్రిల్ 5, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:55 సూర్యోదయం: ఉదయం గం.6:07
జొహర్: మధ్యాహ్నం గం.12:19
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.43
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News December 9, 2025
VZM: ‘DCCB ద్వారా రైతులకు రూ.100 కోట్ల రుణాలు’

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని రైతులకు ఆప్కాబ్ సహకారంతో రూ.100 కోట్ల పంట రుణాలు మంజూరు చేయనున్నట్లు DCCB ఛైర్మన్ నాగార్జున మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎకరా పంటకు వరికి రూ.49వేలు, మొక్కజొన్నకి రూ.46వేలు, చెరకుకి రూ.80 వేలు, అరిటికి రూ.75 వేలు మంజూరు చేస్తామన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు,3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు,1B, ఆడంగల్ జతచేసి పంటల సీజన్లో DCCB బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 9, 2025
7వేల రిజిస్ట్రేషన్లే పెండింగ్: మంత్రి నారాయణ

AP: రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. 66K ప్లాట్లలో 7K మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందన్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని, రైతులు ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. లంక భూములు, అసైన్డ్ భూముల సమస్యలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను ఆయన ఇవాళ పరిశీలించారు.
News December 9, 2025
పోస్టర్ రగడ.. ‘కుంభ’గా రేవంత్ రెడ్డి

TG: ‘వారణాసి’ సినిమాలోని విలన్(కుంభ) పాత్రలో CM రేవంత్ ఉన్నట్లుగా పోస్టర్ క్రియేట్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిని తాజాగా BJP షేర్ చేయడం వివాదానికి ఆజ్యం పోసినట్లైంది. భారతదేశంలో ఎమర్జెన్సీ మైండ్సెట్ ఇంకా సజీవంగానే ఉందని మండిపడింది. రేవంత్ ప్రభుత్వం నియంతృత్వ వైఖరి అవలంబిస్తోందని, అవినీతి పాలన కొనసాగిస్తోందని X వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది.


