News October 19, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 19, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:14 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:52 గంటలకు
ఇష: రాత్రి 7.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News January 3, 2025

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జులు వీరే

image

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్‌ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని తమిళనాడుకు రిటర్నింగ్ అధికారిగా నియమించింది. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

News January 3, 2025

BGT: నేటి టెస్టు టైమింగ్స్ ఇవే

image

నేడు సిడ్నీలో బోర్డర్ గవాస్కర్‌ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల టోర్నీలో 2-1తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. దీంతో సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే భారత్ చివరి టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఉదయం 4.30 గంటలకు టాస్ వేస్తారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు తొలి సెషన్, 7.40 నుంచి 9.40 వరకు రెండో సెషన్, 10 నుంచి 12 గంటల వరకు ఆఖరి సెషన్ ఉంటుంది.

News January 3, 2025

అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?

image

ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్‌నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.