News October 22, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: అక్టోబర్ 22, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:11 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు అసర్: సాయంత్రం 4:13 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 5:50 గంటలకు ఇష: రాత్రి 7.03 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 16, 2026
కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి కాలేదు: సీఎం

TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావాల్సినంత అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో అభివృద్ధి చెంది ఉండేది. పాలమూరు జిల్లాతో పాటు సమానంగా నిధులు ఇస్తా. నిర్మల్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, కొత్త స్టేడియం మంజూరు చేస్తాం’ అని నిర్మల్ సభలో ప్రకటించారు.
News January 16, 2026
NABARDలో 162 ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు పూర్తి నోటిఫికేషన్ రానుండటంతో పాటు దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. వయసు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో 50% మార్కులు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. స్థానిక భాష కచ్చితంగా వచ్చి ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్, లాంగ్వేజీ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News January 16, 2026
తొలిసారిగా హైదరాబాద్ వెలుపల క్యాబినెట్ భేటీ

TG: రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని పొంగులేటి చెప్పారు.


