News November 4, 2024
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: నవంబర్ 4, సోమవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:02 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:16 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:07 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:43 గంటలకు
✒ ఇష: రాత్రి 6.57 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 16, 2026
HYD: నైట్ ఫ్లైఓవర్లు బంద్!

‘షబ్-ఏ-మేరాజ్’ సందర్భంగా HYDలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. వాహనదారుల భద్రత కోసం ఈ రోజు రా.10 గం. నుంచి రేపు ఉదయం వరకు గ్రీన్ల్యాండ్స్, PVNR ఎక్స్ప్రెస్వే, లంగర్హౌస్ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు, నెక్లెస్ రోడ్ మూసేస్తున్నట్లు జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. షేక్పేట్, బహదూర్పురా ఫ్లైఓవర్లను అవసరాన్ని బట్టి ఓపెన్ చేస్తారు. అత్యవసరమైతే 9010203626 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
News January 16, 2026
282 పోస్టులు.. అప్లై చేశారా?

CSI ఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జిల్లా కేంద్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఏపీలో 4, తెలంగాణలో 11 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cscspv.in
News January 16, 2026
కనుమ – ముక్కనుమ: తేడాలేంటి?

నేడు కనుమ. రేపు ముక్కనుమ. ఈ పండుగలు పల్లె సంస్కృతికి అద్దం పడతాయి. కనుమ నాడు వ్యవసాయానికి చేదోడుగా నిలిచే పశువులను పూజించి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇక ముక్కనుమ పండుగ ముగింపు సంబరం. ఈరోజున పశువులను చెరువులలో శుభ్రంగా కడిగి విశ్రాంతినిస్తారు. కనుమ రోజున శాకాహారానికి ప్రాధాన్యత ఉంటే, ముక్కనుమ నాడు మాంసాహార విందులు, గ్రామ దేవతల ఆరాధన, బొమ్మల నోము వంటి కార్యక్రమాలతో పండుగకు ఘనంగా ముగింపు పలుకుతారు.


