News November 10, 2024
ఈరోజు నమాజ్ వేళలు

✒ తేది: నవంబర్ 10, ఆదివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5:04 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6:19 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4:05 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 5:42 గంటలకు ✒ ఇష: రాత్రి 6.56 గంటలకు నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 6, 2026
బుడమేరుపై వంతెన నిర్మాణానికి రూ.104.12కోట్లు

తరచూ అధిక వర్షాల వల్ల ముంపునకు గురయ్యే బుడమేరుపై వంతెన నిర్మాణానికి రూ.104.2 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఎంపీ బాలశౌరి వినతుల నేపథ్యంలో కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో నందివాడ మండలం పుట్టగుంట గ్రామం సమీపంలో నేషనల్ హైవే 216-Hపై బుడమేరు డ్రెయిన్‌పై కొత్తగా 2 వరుసలు, పేవ్డ్ షోల్డర్స్ (2L+PS) కలిగిన ప్రధాన వంతెనను నిర్మించనున్నారు.
News April 6, 2026
కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్.. మంత్రి వార్నింగ్

TG: డ్రగ్స్ నిర్మూలనకు EAGLE వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా, ఫుడ్ సేఫ్టీ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ సంకల్పించారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కల్తీ కేటుగాళ్లపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో 11వేలకు పైగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
News April 6, 2026
చెరకు రసం.. వీరు తాగొద్దు!

వేసవిలో చాలా మంది చెరకు రసాన్ని ఇష్టంగా తాగుతారు. అయితే డయాబెటిస్ (షుగర్) వ్యాధిగ్రస్థులు దానికి దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెరకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికమని, రక్తంలో షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచుతుందని తెలిపారు. లివర్, హార్ట్ సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. తక్కువ రోగనిరోధక శక్తి, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సైతం చెరకు రసం తాగొద్దని సూచించారు.
Share It


