News November 29, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 29, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5:12 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:29 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News November 29, 2024
ముంబైలో మరోసారి భేటీ: ఏక్నాథ్ శిండే
కేంద్ర మంత్రి అమిత్ షా నివాసంలో చర్చలు సానుకూలంగా జరిగినట్లు మహారాష్ట్ర అపద్ధర్మ సీఎం ఏక్నాథ్ శిండే తెలిపారు. ఎన్నికల్లో విజయం తర్వాత షా, నడ్డాతో ఇదే తొలి సమావేశమని చెప్పారు. మరో సమావేశం ముంబైలో ఉంటుందని తెలిపారు. ఇందులో సీఎం ఎవరనే విషయమై నిర్ణయానికి వస్తారని పేర్కొన్నారు. షాతో భేటీ తర్వాత మహాయుతి నేతలు తిరిగి ముంబైకి పయనమయ్యారు.
News November 29, 2024
సుబ్బరాజు భార్య ఎవరో తెలుసా?
నటుడు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న ఫొటో పెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఆయన వివాహం చేసుకున్న అమ్మాయి పేరు స్రవంతి. అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్గా పనిచేస్తున్నారు. వీరి పెళ్లి అమెరికాలో సింపుల్గా జరగగా హైదరాబాద్లో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తమ ప్రయాణం మొదలైందని, విష్ చేసిన వారికి సుబ్బరాజు Xలో ధన్యవాదాలు తెలిపారు.
News November 29, 2024
విరాట్ సరసన నిలిచేది ఎవరో?
BGTలో భారత జట్టు డిసెంబర్ 6 నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడనుంది. డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు టీమ్ ఇండియా నాలుగు డై అండ్ నైట్ టెస్టులు ఆడగా కేవలం కోహ్లీ మాత్రమే సెంచరీ సాధించారు. 2019లో బంగ్లాతో జరిగిన మ్యాచులో ఆయన 136 పరుగులు చేశారు. ఈ క్రమంలో BGT రెండో టెస్టులో ఏ భారత ఆటగాడు సెంచరీ చేసి కోహ్లీ సరసన నిలుస్తారని భావిస్తున్నారో కామెంట్ చేయండి?