News November 30, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: నవంబర్ 30, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 5:13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:30 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:05 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.57 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 2, 2026
రూపీకి రిలీఫ్.. డాలర్ దెబ్బ నుంచి కోలుకుంది

గత కొన్నిరోజులుగా క్షీణిస్తున్న రూపాయికి ఈరోజు ఊరట లభించింది. RBI జోక్యం చేసుకోవడంతో 42 పైసలు పెరిగింది. ఆరు వారాల తర్వాత మళ్లీ ఒక రోజులో ఆ స్థాయి గెయిన్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుకు 91.53గా ఉంది. RBI సూచన మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో రూపాయి తేరుకుంది.
News February 2, 2026
మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి

పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే దానికి బీజాలు ఇంట్లోనే పడాలంటున్నారు సైకాలజిస్టులు. పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. ప్రపంచాన్ని మనం మార్చలేం కానీ ఇంట్లో ఆ మార్పులు తేవచ్చంటున్నారు. ఇంటి వాతావరణం పిల్లలకు ప్రేమ పూర్వకంగా ఉండాలంటున్నారు. అదే వారి జీవితానికి ప్రతిబింబం కాబట్టి తల్లిదండ్రులు వారిపై అరవడం, నిరుత్సాహపరచడం వంటివి చేయకూడదని సూచిస్తున్నారు.
News February 2, 2026
పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా: బొత్స

AP: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై TDP దాడులు దారుణమని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘రాష్ట్రానికి మంచి పేరుండేది. దాడులతో దాన్ని చెడగొట్టి చంద్రబాబు అప్రదిష్ఠ తెస్తూ బిహార్‌లా మారుస్తున్నారు. మరే పార్టీకీ కార్యకర్తలు లేరనుకుంటున్నారా? ఇది సంప్రదాయం కాదు. పోలీసులు దగ్గరుండి దాడులు చేయిస్తారా? DGP ఏం చేస్తున్నారు? ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి’ అని బొత్స కోరారు.


