News April 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 15, సోమవారం ఫజర్: తెల్లవారుజామున గం.4:46 సూర్యోదయం: ఉదయం గం.6:00 జొహర్: మధ్యాహ్నం గం.12:16 అసర్: సాయంత్రం గం.4:42 మఘ్రిబ్: సాయంత్రం గం.6:32 ఇష: రాత్రి గం.07.47 నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 3, 2026

భారత్‌పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. టారిఫ్‌లు 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ PM మోదీతో మాట్లాడా. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. శక్తిమంతమైన నాయకుడు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు.

News February 3, 2026

నొప్పి ఎక్కడో మాత్రకు ఎలా తెలుస్తుంది?

image

నిజానికి నొప్పి ఎక్కడుందో మాత్ర కనిపెట్టదు. అది రక్తంలో కలిసి శరీరమంతా ప్రయాణిస్తుంది. అయితే మనకు నొప్పి ఉన్నచోట ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు విడుదలవుతాయి. మాత్రలోని మందు రక్తం ద్వారా ఆ రసాయనాలు ఉత్పత్తి అవుతున్న చోటుకు కూడా వెళ్తాయి. నొప్పి సంకేతాలు మెదడుకు చేరకుండా అక్కడ అడ్డుకుంటాయి. అలా మనకు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పెయిన్ కిల్లర్ ఆ శరీర భాగంలో ఉన్న అసలు సమస్యను పరిష్కరించలేదు.

News February 2, 2026

నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

image

AP: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని Dy.CM పవన్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు.