News May 21, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: మే 21, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:23 గంటలకు సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:13 గంటలకు
అసర్: సాయంత్రం 4:45 గంటలకు
మఘ్రిబ్: రాత్రి 6:43 గంటలకు
ఇష: రాత్రి 08.03 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News December 24, 2024

బడ్జెట్‌పై ఆర్థికవేత్తలతో మోదీ సమాలోచనలు

image

కేంద్ర బ‌డ్జెట్‌లో పొందుప‌ర‌చాల్సిన అంశాలు, కేటాయింపుల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకొనేందుకు ఆర్థిక‌వేత్త‌లు, భిన్న రంగాల నిపుణుల‌తో ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా సమావేశ‌మ‌య్యారు. Feb 1న నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. Niti Aayog Vice-Chairman సుమన్ బేరీ, CEO సుబ్రహ్మణ్యం, Chief Economic Advisor అనంత నాగేశ్వరన్, ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా తదితరులు పాల్గొన్నారు.

News December 24, 2024

విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్

image

విమాన ప్రయాణికులకు BCAS షాక్ ఇచ్చింది. కొత్త హ్యాండ్ బ్యాగేజీ విధానం ప్రకారం ఇకపై ఒక్క బ్యాగ్‌ను మాత్రమే విమానంలోపలికి తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. దేశీయ లేదా అంతర్జాతీయ విమానంలో ప్రయాణించినా ఇది వర్తిస్తుంది. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ ఉన్నా మరొక బ్యాగ్ తీసుకెళ్లకూడదు. ఏదైనా అదనపు సామాను ఉంటే తప్పనిసరిగా చెక్ ఇన్ చేయాలి.

News December 24, 2024

అమరావతికి రూ.11 వేల కోట్ల హడ్కో రుణం: నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన పర్యటించారు. ‘అమరావతికి రుణం కోసం జిందాల్ ఛైర్మన్ పీఆర్ జిందాల్‌తో భేటీ అయ్యా. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాల ఏర్పాటుపై ఆయనతో చర్చించా. ఇప్పటికే జిందాల్ సంస్థ గుంటూరు, వైజాగ్‌లో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు.