News June 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 11, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:52 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:50 గంటలకు
ఇష: రాత్రి 8.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 6, 2024

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వీరే

image

TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.

News October 6, 2024

భారత్ చేరుకున్న మహ్మద్ ముయిజ్జు

image

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు భారత్‌కు వచ్చారు. తన సతీమణి సాజిదా మహ్మద్‌తో కలిసి ఆయన న్యూఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముయిజ్జు దేశంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, జైశంకర్ తదితరులతో భేటీ అవుతారు. తాజ్‌మహల్ సందర్శన అనంతరం ఆయన ముంబై, బెంగళూరులో జరిగే పలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News October 6, 2024

ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: CM

image

TG: ఎవరు అడ్డుపడినా మూసీ నది ప్రక్షాళన ఆగదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుతగులుతున్న BJP MP ఈటల రాజేందర్ కూడా BRS నేతల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని సీఎం విమర్శించారు. మూసీ పరీవాహకంలో ఉంటున్న పేదల జీవితాలు బాగుపడవద్దా? అని ప్రశ్నించారు. నిర్వాసితులు అవుతారని ఆలోచిస్తే ప్రాజెక్టులు ఎలా సాధ్యమవుతాయన్నారు.