News June 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 15, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:42 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:17 గంటలకు
అసర్: సాయంత్రం 4:54 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:52 గంటలకు
ఇష: రాత్రి 8.13 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News March 3, 2026

హార్ముజ్ బంద్.. భారత్‌కు నిలిచిన క్రూడాయిల్

image

ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్‌తో ‘హార్ముజ్ జలసంధి’ వద్ద షిప్పుల మూవ్‌మెంట్ ఆగిపోయింది. దీనివల్ల భారత్‌కు వచ్చే చమురు దిగుమతులు దారుణంగా పడిపోయాయి. Febలో రోజుకు 28 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ఈ మార్గం ద్వారా భారత్‌కు వచ్చింది. మార్చి 1 నాటికి అది ‘సున్నా’కు పడిపోయింది. మన దేశానికి కావాల్సిన 50% చమురు, దాదాపు 100% LPG ఈ రూట్ నుంచే వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఇక్కడి నుంచే వెళ్తుంది.

News March 3, 2026

ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

image

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.

News March 3, 2026

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

image

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్‌ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని ఆమె సూచించారు.