News July 8, 2024

ఈరోజు న్యూస్ HEADLINES

image

* జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 400 మందికి గాయాలు
* TG: గ్రూప్-1 ఫలితాలు విడుదల
* MPలు కలిసి పోరాడాలన్న రేవంత్.. సాధ్యం కాదన్న CBN
* TG: అసంపూర్తి ప్రాజెక్టులపై CM రేవంత్ ఫోకస్
* AP: జనసేన శ్రేణులకు డిప్యూటీ CM పవన్ వార్నింగ్
* కాంగ్రెస్, BRSను అభినందిస్తున్నా: CBN
* 2వ టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
* ఇండియా, సౌతాఫ్రికా మహిళల 2వ టీ20 రద్దు

Similar News

News January 17, 2025

VIRAL: ఇదేందయ్యా ఇది.. స్టూడెంట్ మూవీ రివ్యూ చూశారా?

image

సాధారణంగా స్కూళ్లలో విద్యార్థులకు సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరనే విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ తన కజిన్‌కు మూవీ రివ్యూను హోంవర్క్‌గా ఇచ్చినట్లుగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. సలార్ మూవీకి విద్యార్థికి రివ్యూ ఇవ్వగా మా టైమ్‌లో ఇలాంటి హోమ్ వర్క్ ఉంటే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సలార్ క్రేజీ ఇంకా కొనసాగుతోందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు.

News January 17, 2025

రూ.446 కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్

image

TG: సీఎం రేవంత్ ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖలో రూ.446 కోట్ల పెండింగ్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. వీటిలో రూ.300 కోట్ల ఉపాధి హామీల పనుల బిల్లులు, రూ.146 పారిశుద్ద్య కార్మికుల వేతనాలకు చెల్లించనున్నారు. త్వరలోనే మరిన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ-కుబేర్ ద్వారా పారిశుద్ద్య కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

News January 17, 2025

7 కోట్లు దాటిన భక్తజనం.. రష్యన్ బాబాను చూశారా?

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. గంగా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానమాచరించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గత ఐదు రోజుల్లో 7 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చారని సమాచారం. ఈ మేళాలో రష్యన్ సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏడడుగుల ఎత్తున్న ఆయనను పలువురు పరశురాముడిగా పిలుస్తున్నారు. ఆయన టీచింగ్ కెరీర్‌ను వదిలేసి నేపాల్‌‌లో ఉంటున్నారు.