News April 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.11 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.29 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News October 17, 2025

గంభీర్‌తో రోహిత్.. క్యాప్షన్ ప్లీజ్!

image

టీమ్ ఇండియా కెప్టెన్సీ చేజారిన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి కనిపించారు. ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా గంభీర్.. హిట్‌మ్యాన్‌కు సలహాలు ఇచ్చారు. రోహిత్ సీరియస్‌గా చేతులు కట్టుకుని కోచ్ మాటలు విన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ.. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, లోకల్ బౌలర్లను ఎదుర్కొన్నారు. పై ఫొటోకు మీ క్యాప్షన్ ఏంటో కామెంట్ చేయండి.

News October 16, 2025

ధన త్రయోదశి.. ఈ వస్తువులు కొనవద్దు

image

దీపావళికి రెండ్రోజుల ముందు వచ్చే ధన త్రయోదశి రోజు (OCT 18) వెండి, బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఇదే సమయంలో కొన్నింటిని ఆరోజు కొనవద్దని పురోహితులు చెబుతున్నారు. ఇనుము శనికి చిహ్నం కావడంతో ఆరోజు కొనొద్దని అంటున్నారు. అలాగే గాజు (రాహు), స్టీల్, సూదులు, కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులు, నెయ్యి, నూనె, నల్ల రంగు దుస్తులు లేదా సామాగ్రి జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. Share It

News October 16, 2025

మామునూర్ ఎయిర్‌పోర్టుకు రూ.90 కోట్లు, అంగన్వాడీలకు రూ.156 కోట్లు

image

TG: వరంగల్ మామునూర్ విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.90 కోట్లు మంజూరు చేసింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మొత్తం 949 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించారు. మరో 223 మంది రైతుల నుంచి 253 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు పోషకాహార పథకం (SNP) కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన రూ.156 కోట్ల నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసింది.