News April 2, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

ఏప్రిల్ 2, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.20 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.42 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

Similar News

News February 2, 2026

విచారణ దశలోనే ఇల్లీగల్ అని ఎలా అంటారు: హరీశ్ రావు

image

TG: కేసు దర్యాప్తులో ఉండగానే SIT అధికారి సజ్జనార్ ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అని పేర్కొనడంపై BRS నేత హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు. ‘దీన్ని చూస్తుంటే దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. ఇది రాజకీయ ప్రేరేపిత పక్షపాత దర్యాప్తు అని స్పష్టమవుతోంది. మీ X ప్రకటనలో కనీసం KCRను ప్రతిపక్ష నేత అని సంబోధించడానికీ ఇష్టపడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నించారు.

News February 2, 2026

నిజమైన కరుంగలి మాలను ఎలా గుర్తు పట్టాలి?

image

మార్కెట్లో నకిలీ మాలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నిజమైన కరుంగలి పూసలు బరువుగా ఉంటాయి. నీటిలో వేస్తే వెంటనే మునిగిపోతాయి. నకిలీవి తేలుతాయి. నిజమైన పూసలు సహజమైన నలుపు రంగులో ఉంటాయి. తాకితే నునుపుగా, చల్లగా అనిపిస్తాయి. వీటిపై ఎటువంటి రంగు పూత ఉండదు. ఓ పూసను నీటిలో నానబెట్టినప్పుడు నీరు రంగు మారకూడదు. అసలైన కలప కాంతిని సహజంగా ప్రతిబింబించాలి.

News February 2, 2026

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పసిపిల్లల్ని చంపి..

image

కర్ణాటకలోని బగల్‌కోట్‌లో ముగ్గురు పసిపిల్లలను ఉరేసి చంపిన ఓ తల్లి డీజిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం ఇంటిలోపలి వైపు తాళం వేసి ఉండగా స్థానికుల సాయంతో భర్త డోర్ ఓపెన్ చేశారు. పిల్లలు అప్పటికే చనిపోగా చావుబతుకుల్లో ఉన్న భార్య(రూప)ను ఆసుపత్రికి తరలించారు. అత్తింటి వేధింపులే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.