News April 4, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

ఏప్రిల్ 4, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4.56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.19 గంటలకు
అసర్: సాయంత్రం 4.44 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
ఇష: రాత్రి 7.43 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News April 4, 2025
బియ్యపు గింజ కంటే చిన్నదైన పేస్‌మేకర్

ప్రపంచంలోనే అతి చిన్నదైన పేస్‌మేకర్‌ను నార్త్‌వెస్ట్రన్ వర్సిటీ(US) సైంటిస్టులు రూపొందించారు. ఇది 1.8mm వెడల్పు, 3.5mm పొడవుతో ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుంది. ఇది అన్ని సైజుల గుండెలకు పనిచేస్తుంది. అయితే గుండె జబ్బులతో జన్మించిన పిల్లలకు బాగా సూటవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హార్ట్ ఆపరేషన్ల సమయంలో టెంపరరీ పేస్‌మేకర్ కీలక పాత్ర పోషిస్తుందని, సైజ్ కూడా కీలకమేనని పేర్కొంటున్నారు.
News April 4, 2025
గ్రూప్1 నియామకాలపై కేసుల కొట్టివేత

తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలగాయి. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన TGPSC త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలిచే అవకాశముంది.
News April 4, 2025
GOLD: ది సిల్వర్ జూబిలీ స్టోరీ

మిలీనియమ్ ఇయర్ 2000లో భారత్‌లో 10 గ్రా. బంగారం సగటు ధర ₹4,400. తర్వాతి ఐదేళ్లలో ₹3వేలే పెరిగింది. ఆ తర్వాతి మూడేళ్లకు 2008లో ప్రపంచ మాంద్యంతో ₹13వేలకి చేరింది. 2018లో ₹30వేలు, 2020లో ₹50వేలు దాటింది. 2021లో ₹48వేలకు తగ్గినా 2022లో పెరిగి ₹55వేలకు వెళ్లింది. 2023లో ₹63వేలు, 2024లో ₹78వేలు పలికిన పసిడి ఇప్పుడు ₹90వేలపై కూర్చుంది. ఈ ఏడాది చివరికి లక్షకు చేరడం ఖాయమట. ఇది గోల్డ్ సిల్వర్ జూబిలీ కథ.